జిల్లా పోలీసులకు.. ఉగాది పురస్కారాలు
రమేష్‌బాబుకు
ఉత్తమ సేవా పతకం..
శ్రీకాకుళం ఒకటో పట్టణ ఏఎస్‌ఐ బి.రమేష్‌బాబుకు ఉత్తమ సేవా పతకం దక్కింది. 1990 కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన రమేష్‌బాబు 2011లో హెచ్‌సీగా, 2017లో ఏఎస్‌ఐగా ఉద్యోగోన్నతి పొందారు. 2024లో కూడా సేవాపతకం వరించింది.
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసులు వారి సర్వీసులో కనబర్చిన అత్యుత్తమ ప్రతిభకు గాను ఉగాది – 2025 పురస్కారాల్లో సేవా పతకాల పంట పండింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి శుక్రవారం వెలువడ్డాయి.
సేవా పతకాలు వరించిన వారిలో..
జిల్లా ట్రాఫిక్ రికార్డ్ బ్యూరో (డీటీఆర్బీ) ఎస్‌ఐ వి.నేతాజీ, సీసీఎస్ ఎస్‌ఐ ఎస్ గఫూర్, ఓడలరేవు(మైరెన్) సీఎస్‌పీఎస్ ఎస్‌ఐ జి.విలియమ్స్, ఏఆర్ ఏఎస్‌ఐ వై.రామారావు, ఏఆర్ హెచ్‌సీ సీహెచ్ విశ్వనాథం, జి.సిగడాం హెచ్‌సీ కె.నాగేశ్వరరావు, సీసీఎస్ పీసీ ఎ.విశ్వనాథం, ఏఆర్ పీసీ ఆర్.మీరాబాబు, భావనపాడు సీఎస్‌పీఎస్ పీసీ యు.లక్ష్మీపతి ఉన్నారు.
శ్రీకాకుళం ఒకటో పట్టణ ఏఎస్‌ఐకి ఉత్తమ సేవా పతకం
విజిలెన్సులో ముగ్గురికి, ఫైర్ విభాగంలో ముగ్గురికి పతకాలు
జిల్లా అగ్నిమాపక విభాగంలో..
పలాస స్టేషన్ అధికారి బి.సోమేశ్వరరావు, శ్రీకాకుళం ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్‌మేన్ బి.శృంగారినాయుడు, డ్రైవింగ్ ఆపరేటర్ షేక్ రహీమ్‌లకు సేవా పతకాలు వరించాయి.
విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో..
ఎస్‌ఐ ఎన్.అశోక చక్రవర్తి, కానిస్టేబుళ్లు ఇజ్జాడ ఈశ్వరరావు, పి.లక్ష్మీనారాయణలకు ఏపీ పోలీస్ సేవా పతకాలు వరించాయి.
జిల్లా పోలీసులకు.. ఉగాది పురస్కారాలు
జిల్లా పోలీసులకు.. ఉగాది పురస్కారాలు
జిల్లా పోలీసులకు.. ఉగాది పురస్కారాలు
జిల్లా పోలీసులకు.. ఉగాది పురస్కారాలు
జిల్లా పోలీసులకు.. ఉగాది పురస్కారాలు
జిల్లా పోలీసులకు.. ఉగాది పురస్కారాలు
జిల్లా పోలీసులకు.. ఉగాది పురస్కారాలు
జిల్లా పోలీసులకు.. ఉగాది పురస్కారాలు
Comments
Please login to add a commentAdd a comment