డప్పు కళాకారులను ఆదుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): డప్పు కళాకారులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిపురం గురువులు, గొర్లె రవి డిమాండ్ చేశారు. నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్‌లో జిల్లాస్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డప్పు ప్రాచీన కాలం నుంచి సమాజాన్ని చైతన్య పరుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో డప్పు కళాకారులు ఉన్నారని, ప్రధానంగా వీరంతా తరతరాలుగా డప్పు కళను వృత్తిగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం రూ.7 వేల పెన్షన్, గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. 2014 టీడీపీలో పెన్షన్లు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరలా సర్వే పేరుతో పెన్షన్లు తొలగించే ప్రక్రియ ప్రారంభించడం సరికాదన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు యథావిధిగా కొనసాగించాలని, కొత్త పెన్షన్లు ఇవ్వాలని విన్నవించారు. అధికారంలోకి వచ్చి సుమారు 10 నెలలు కావస్తున్నా ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమన్నారు. సమావేశంలో ఆరవ డిల్లీ, బాలు, దమ్ము కృష్ణ, బోనేల రామయ్య, సవాలపురపు అప్పన్న, కాళ్ల అప్పారావు, గెడ్డపు రాజారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment