ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
● వ్యక్తికి తీవ్రగాయాలు
కంచిలి: మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం అర్థరాత్రి ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు, రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బురదపాడు గ్రామానికి చెందిన కప్పల జగదీష్ రెడ్డి అనే యువకుడు ఆదివారం కొల్లూరు గ్రామానికి వెళ్లాడు. అనంతరం అతను జాడుపూడి వద్ద భోళా శంకర్ దాబాకు ఆదివారం రాత్రి డిన్నర్‌కు వచ్చాడు. డిన్నర్ పూర్తి చేసుకొని తన బైక్ మీద జాడుపూడి కాలనీ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా, ఇచ్ఛాపురం నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కప్పల జగదీష్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని 108 అంబులెన్స్‌లో ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం వేకువజామున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment