శ్రీకాకుళం కల్చరల్: నాటక రంగం కోసమే లోకనాథం రామలింగస్వామి తన జీవితం అంకితం చేశారని పలువురు వక్తలు కొనియాడారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో రామలింగస్వామి ఇంటికి వెళ్లి ‘ముంగిట సన్మానం’ చేశారు. ఈ సందర్భంగా శ్రీశయన కార్పొరేషన్ చైర్మన్ డి.పి.దేవ్ మాట్లాడుతూ శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య ప్రతి ఏడాది కళకారుడి ఇంటికే వచ్చి సన్మానం చేయడం గొప్ప విషయమన్నారు.
కళాకారుల సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి పన్నాల నరసింహమూర్తి మాట్లాడుతూ 16ఏళ్లుగా ఎందరో కళాకారుల ఇళ్లకు వెళ్లి ముంగిట సన్మానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారావు, సమాఖ్య కార్యదర్శి బి.రామచంద్రదేవ్, బి.ఏ.మోహనరావు, కంచరాన అప్పారావు, పైడి సత్యవతి, బీఎంఎస్ పట్నాయక్, శివప్రసాద్, పొట్నూరు వెంకటరావు, నక్క శంకరరావు, బెహరా నాగేశ్వరరావు, కేశిరెడ్డి రాజేశ్వరి, జగన్నాథనాయుడు తదితరులు పాల్గొన్నారు.