ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రేపటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించే మూడు విభాగాల పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు సోమవారం తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు షిఫ్ట్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు షిఫ్ట్–2లు పరీక్షా సమయంగా నిర్ణయించామన్నారు. పరీక్షకు అరగంట ముందుగా గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. సమావేశంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఏపీపీఎస్సీ ప్రతినిధులు ఈశ్వరి, పద్మప్రియ, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి టీవీ బాలకష్ణ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment