గడ్డి ట్రాక్టర్ దగ్ధం
బూర్జ: మండలంలోని కొల్లివలస జంక్షన్‌లో గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధమైంది. సింగన్నపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ నారాయణపురం జంక్షన్ వైపు నుంచి గడ్డి లోడుతో విశాఖ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గడ్డి కుప్పకు విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వచ్చి మంటలు అదుపుచేశారు. ట్రాక్టర్ ఇంజిన్ నుంచి ట్రాలీ వేరు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఫీజుల వసూలుపై ఫిర్యాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: టెక్కలిలో ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి ప్రభుత్వ నిబంధనలు, సూచనలకు వ్యతిరేకంగా ఫీజు వసూలు చేస్తున్నారంటూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా శాఖ ప్రతినిధులు శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావుకు ఆయన చాంబర్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని, విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని ఇటీవల ప్రకటన చేశారని, అయితే ఆ కళాశాల యాజమాన్యం ఆ ప్రకటన నమ్మడం లేదని, సకాలంలో ఫీజులు కట్టలేని వారికి ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది చదువులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదంటూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. పూర్తి ఫీజులు కట్టిన వారికే హాల్‌టికెట్లు ఇస్తున్నారని తెలిపారు.జిల్లాలో పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అనంతరం డీఆర్‌వో సంబంధిత కళాశాల డైరెక్టర్‌తో మాట్లాడి ఆరా తీశారు.
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment