రచ్చబండ ధ్వంసంపై ఆరా
ఇచ్ఛాపురం రూరల్: సుమారు ముఫ్‌పై ఏళ్ల క్రితం నిర్మించిన రచ్చబండను టీడీపీ నాయకుడు అధికార అహంతో కూలదోస్తున్నట్లు గురువారం సాక్షి దినపత్రికలో ‘రెచ్చిపోయిన పచ్చ తమ్ముడు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఎన్.వెంకటరావు ఆదేశాల మేరకు శుక్రవారం వీఆర్వో రాజారావు, విలేజ్ సర్వేయర్ మీనాకుమారీలు కె.శాసనాం గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. తన సొంత ఆస్తికి ఎదురుగా రచ్చబండ ఉండటంతో దాన్ని అడ్డు తొలగించేందుకు కూలదోసినట్లు అధికారుల ఎదుట టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు ఒప్పుకున్నాడు. గ్రామస్తుల సమక్షంలో కొలతలు తీయడంతో అసలు రహస్యం బట్టబయలైంది. రచ్చబండతో పాటు మరో పది అడుగుల వరకు ప్రభుత్వ పోరంబోకు స్థలం ఉందని, రచ్చబండను తొలగించే అధికారం ఫకీరుకు గానీ, వారి కుటుంబ సభ్యులకు లేదని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు సైతం పచ్చ తమ్ముడికి చీవాట్లు పెట్టడంతో వెనుదిరిగాడు.
రచ్చబండ ధ్వంసంపై ఆరా
Comments
Please login to add a commentAdd a comment