ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నట్లు దుప్పలవలస బాలురు, ఎచ్చెర్ల బాలికలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు బోర బుచ్చిబాబు, లక్ష్మి సోమవా రం ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర, ఐదో తరగతి ప్రవేశ పరీక్ష లు ఏప్రిల్ ఆరు నుంచి 13వ తేదీకి వాయిదా పడినట్లు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఐదో తరగతి ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2 గంటలు నుంచి 4.30 గంటల వరకు ఇంటర్ ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు చెప్పారు. విద్యార్థులు గమనించాలని, హాల్ టిక్కెట్లతో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు.
టీచర్ల సస్పెన్షన్లు రద్దు చేయాలని డిమాండ్
శ్రీకాకుళం అర్బన్: ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారి చేపట్టిన ఉపాధ్యాయ సస్పెన్షన్‌లను వెంటనే రద్దు చేయాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ముక్త కంఠంతో డిమాండ్ చేసింది. శ్రీకాకుళంలోని ఎన్‌జీఓ సంఘ కార్యాలయంలో సోమవారం ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ సమావేశం చౌదరి రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. 25న సాయంత్రం 4గంటలకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. తదుపరి కొన్ని నిరసనల అనంతరం ఏప్రిల్ 3న టెన్త్ స్పాట్ బహిష్కరించాలని నిర్ణయించారు.
నేడు శ్రీకూర్మనాథాలయ హుండీ ఆదాయం లెక్కింపు
గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథాలయ హుండీలను మంగళవారం తెరిచి ఆదాయం లెక్కించనున్నామని ఆలయ ఇన్‌చార్జి ఈఓ జి.గురునాథం ఒక ప్రకటనలో తెలిపారు. కూర్మనాథాలయంతో పాటు పాతాళ సిద్ధేశ్వర, తండ్యాలపేట అభయాంజనేయ స్వామి ఆలయ హుండీలను లెక్కించనున్నామని ఆ ప్రకటనలో తెలిపారు.
గురుకుల పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు