కాశీబుగ్గ: దివ్యాంగులకు ఉచితంగా ఈనెల 28న ఉపకరణాలను పంపిణీ చేయనున్నట్టు మదర్ చారిటబుల్ ట్రస్ట్ (దివ్యాంగుల సేవా కేంద్రం)సొండిపూడి వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లారెడ్డి భాస్కరరావు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ఉన్న దివ్యాంగులకు వివిధ రకాలైన ఉచిత ఉపకరణాలు ఇస్తామని అన్నారు. చంక కర్రలు, బ్లైండ్ స్టిక్, వినికిడి యంత్రాలు, చక్రాల కుర్చీ, వాకింగ్ వాకర్స్, సింగల్ వాకింగ్ స్టిక్స్, కృత్రిమ కాళ్లు, చేతులు, పోలియో వారికి కాలిపర్స్ వంటి ఉపకరణాలు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఈనెల 27 తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా అభ్యర్థి పూర్తి వివరాలు 9989371952 ఫోన్ నంబర్‌కు వాట్సాప్‌లో గాని ఫోన్ చేసి గానీ తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. నమోదు చేసుకున్న వారికి మరుసటిరోజు 28 తేదీన ఉపకరణాలు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.