చర్యలు తప్పవు
ఈ విషయం నా దృష్టికి రాలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతాం. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు కూడా తెలియజేస్తాం. –డి.హరి,
డిప్యూటీ తహసీల్దార్, సంతబొమ్మాళి
●
సంతబొమ్మాళి: నౌపడ, మర్రిపాడు, సీతానగరం తదితర గ్రామాల్లో మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. ఈ మండలాల్లో చెరువులు, సాగునీటి కాలువలు, గుంటల్లో ఉన్న నీటిని పోర్టు కోసం తీసుకెళ్లిపోతుండడంతో పశువులకు గుక్కెడు కరువైపోతోంది. మూలపేట పోర్టు పనులకు సంబంధించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ట్యాంకర్ల ద్వారా నీరు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ట్యాంక్ (2వేల లీటర్లు) రూ.700లకు, లారీ ట్యాంక్ (5వేల లీటర్లు) రూ.1500లు చొప్పున రోజుకు సుమారు 100 లోడులు వరకు పోర్టుకు నీటిని తరలించుకుని వెళ్లిపోతున్నారు. చెరువులు, కాలువల వద్ద ఇంజిన్ సాయంతో ట్యాంకర్లకు నీటిని లోడింగ్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. కాలువలు తవ్వి మరీ ఉన్న నీరు తోడేస్తున్నారు. దీంతో మేత కోసం తిరుగాడే మూగజీవాలకు వేసవిలో తాగేందుకు నీరు లేకుండా పోతోంది. కాపర్లు పశువులను బయటకు తీసుకువెళ్లడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి పశువులను కాపాడి చెరువులు, కాలువల్లో నీరు తోడి అమ్ముకుంటున్న ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పశుపోషకులు కోరుతున్నారు.
దాహం తీరే దారేదీ..?