
ఉద్దానం ఫేజ్–2 ప్రాజెక్టు ట్యాంకుకు స్థల పరిశీలన
పాతపట్నం: మండలంలోని కొరసవాడ–బోరుబద్ర గ్రామాల మధ్య కొండ సమీపంలో ఉద్దానం ఫేజ్–2 ప్రాజెక్టుకు వాటర్ ట్యాంకు నిర్మించేందుకు నాలుగు ఎకరాల స్థలాన్ని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, తహశీల్దార్ ఎస్.కిరణ్‌కుమార్ బుధవారం పరిశీలించారు. రూ.260 కోట్లతో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలంలోని వివిధ గ్రామాలలకు తాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకు నిర్మాణం, పైపులైన్ పనులు చేపట్టనున్నారు. ఉద్దానం ప్రాజెక్టు పనులు త్వరితగతిని చేయాలని ఆర్డీఓ ఇంజినీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి.చంద్రకుమారి, ప్రాజెక్టు డీఈఈ ఆశలత, మండల సర్వేయర్ రామగణపతి, ప్రాజెక్టు ఇంజినీర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.