
వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా యంత్రాంగం అర్హులైన వీఆర్‌ఏలకు వీఆర్వో, అటెండర్లుగా పదోన్నతులు కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తి డిమాండ్ చేశారు. వీఆర్‌ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, పదోన్నతులు కల్పించాలని కోరుతూ ఏప్రిల్ 5న విజయవాడ ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న వీఆర్‌ఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం సీఐటీయూ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. సంఘం జిల్లా నాయకులు ఎన్.సీతప్పడు, డి.అప్పారావు, కె.పురుషోత్తం, బి.రాములమ్మ, మీనాక్షి, రాజారావు, లోకనాథం, శంకర్, బొమ్మాలి, వెంకటరమణ, రామ్మూర్తి, లక్ష్మణరావు, ముకుంద తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సంఘ ప్రతినిధులు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.