పోలాకి: జిల్లాలో రేషన్‌కార్డు లబ్ధిదారులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని డీఎస్‌ఓ జి.సూర్యప్రకాశరావు అన్నారు. బుధవారం మబగాం, ఈదులవలస రేషన్‌డిపోల్లో ఈకేవైసీ నమోదుకాని వారి వివరాలు, అందులో ఎంతవరకు ఈనెలలో అప్‌డేట్ అవుతున్నాయో అని పరిశీలించారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడి వారికి సమాచారం ఎంతవరకు వచ్చిందో అన్న విషయాలపై ఆరాతీశారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది, డిపో డీలర్ సమన్వయంతో ఈనెల 31నాటికి శతశాతం ఈకేవైసీ అప్‌డేట్ జరిగేలా చూడాలని సూచించారు. ఆయన వెంట సీఎస్ డీటీ రామకృష్ణ, స్థానిక రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
యోగా అవార్డులకు
దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి యోగా అవార్డులు–2025 కోసం అర్హులైన వ్యక్తులు/సంస్థల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డాక్టర్ కె.శ్రీధర్‌రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో యోగా అభివృద్ధి, యోగా ప్రచారం కోసం అత్యుత్తమ సహకారాన్ని అందించిన వారు, యోగా అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేసి, అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన వ్యక్తులు/ సంస్థలు ఈనెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని శ్రీధర్‌రావు పేర్కొన్నారు.
కిడ్నీ ఆస్పత్రిలో తాగునీరు కరువు
కాశీబుగ్గ: ఉద్దాన కిడ్నీ రోగుల కోసం నిర్మించిన పలాస కిడ్నీ ఆస్పత్రి, డయాలసిస్ యూనిట్‌లో తాగడానికి మంచినీరు కరువైంది. ఆస్పత్రికి వచ్చిన వారంతా బయటే వాటర్ బాటిళ్లు కొనాల్సి వస్తోంది. ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసి ఫ్రిడ్జ్ పనిచేయడం లేదు. దీంతో రోగులతో పాటు వందమందికిపైగా సిబ్బందికి సైతం సమస్యగా మారింది.
రోజుకు మూడుసార్లు వాటర్ బెల్
శ్రీకాకుళం న్యూకాలనీ: మండే ఎండల నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల కోసం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు తప్పనిసరిగా నీళ్లు తాగేలా రోజుకు మూడుసార్లు వాటర్ బెల్ మోగించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, 11 గంటలకు, మళ్లీ మద్యాహ్నం 12 గంటలకు విధిగా వాటర్‌బెల్ పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ ఉత్తర్వులు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.
గురుకులాల్లో బ్యాక్‌లాగ్
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మెళియాపుట్టి : 2025–26 విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు(బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం సీతంపేట ఐటీడీఏ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 9లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
లబ్ధిదారులకు ఈకేవైసీ తప్పనిసరి
లబ్ధిదారులకు ఈకేవైసీ తప్పనిసరి