నరసన్నపేట: నరసన్నపేటలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. పెద్దపేటకు చెందిన ఇద్దరు యువకులు ఈ బెట్టింగ్ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. బజారు వీధితో పాటు ఆదివరపుపేట కూడలి, తమ్మయ్యపేట జంక్షన్ తదితర చోట్ల గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి మొదలవుతున్న బెట్టింగులు రాత్రి 10 వరకూ నిర్వహిస్తున్నా రు. ఓవర్‌కు ఎంత స్కోర్ చేస్తారు.. ఏ ప్లేయర్ ఎంత స్కోర్ చేస్తారు.. ఏ ప్లేయర్ ఎన్ని సిక్స్‌లు కొడతారు, ఎన్ని ఫోర్లు కొడతారు.. అనే వాటితో పాటు అనేక రకాల బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు భోగట్టా. స్థానిక పెద్దపేటకు చెందిన చైన్నెలో బీటెక్ మొదటి సంవ త్సరం విద్యార్థి ఒకరు ఈ బెట్టింగ్‌ల్లో రూ. 30 లక్షలు వరకూ పొగొట్టుకున్నట్లు తెలుస్తోంది. విషయం తె లుసుకున్న తండ్రి లబోదిబోమంటూ స్థానిక మాజీ ఎంపీటీసీ జామి వెంకటరావు వద్ద మొరపెట్టుకున్నారు. దీనిపై ఎస్పీ కార్యాలయం కూడా ఆరా తీస్తోంది.
బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని యువత బెట్టింగ్‌ల వైపు వెళ్లవద్దని నరసన్నపేట సీఐ జే. శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్‌లో పాల్గొనడం నేరమ ని అన్నారు.