అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం

Mar 28 2025 1:25 AM | Updated on Mar 28 2025 1:21 AM

అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే
101కాల్‌ చేయండి

14 శకటాలు, 184 మంది

సిబ్బందితో సన్నద్ధం

ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి

‘సాక్షి’తో జిల్లా అగ్నిమాపక అధికారి జడ్డు మోహనరావు

శ్రీకాకుళం క్రైమ్‌ :

వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని.. సిబ్బంది సైతం ఫైర్‌ ఎమెర్జెన్సీ కాల్స్‌ పట్ల అలర్ట్‌గా ఉండాలని జిల్లా అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ అధికారి జడ్డు మోహనరావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రమాదాల అప్రమత్తత, సిబ్బంది విధివిధానాలు, శకటాలు, పరికరాల పనితీరును వివరించారు.

మరో 68 మంది అవసరం..

జిల్లాలో శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, ఆమదాలవలస, కొత్తూరు, రణస్థలంలోని అగ్నిమాపక కేంద్రాలకు శాశ్వత భవనాలు ఉన్నాయి. సోంపేట, నరసన్నపేటలో సెమీ పర్మినెంట్‌ భవనాలున్నాయి. మందస, పొందూరుల్లో ఔట్‌పోస్టు ఫైర్‌స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో 45 మంది ఫైర్‌మ్యాన్‌లు, 23 మంది డ్రైవింగ్‌ ఆపరేటర్లు, 33 మంది లీడింగ్‌ ఫైర్‌మ్యాన్‌లు, ఎనిమిది మంది స్టేషన్‌ అధికారులున్నారు. జిల్లా సహాయక అగ్ని మాపక అధికారిగా వరప్రసాద్‌ కొనసాగుతున్నారు. ఔట్‌పోస్టు స్టేషన్లలో 25 మంది ఫైర్‌మ్యాన్‌లు, ముగ్గురు డ్రైవింగ్‌ ఆపరేటర్లున్నారు. వీరే కాక జూనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ ఒక్కరేసి చొప్పున, హోంగార్డులు 44 మంది వరకు ఉన్నారు. తనతో పాటు మొత్తం 184 మంది ఉన్నారని చెప్పారు. మరో 56 మంది ఫైర్‌మ్యాన్‌లు, పది మంది డ్రైవింగ్‌ ఆపరేటర్లు, సోంపేట, కోటబొమ్మాళి కేంద్రాల్లో ఫైర్‌స్టేషన్‌ అధికారులు భర్తీ కావాల్సి ఉంది.

ఇవి పాటించాల్సిందే..

● అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ప్రజలు 101కు గానీ, సంబంధిత స్టేషన్‌ ఫోన్‌ నంబర్‌కు గానీ, స్టేషన్‌ అధికారికి గానీ ఫోన్‌ చేయాలి.

● ప్రజల నుంచి వచ్చే ఫైర్‌ కాల్స్‌ పట్ల క్షణాల్లో స్పందిచకపోయినా, మరమ్మతులకు గురైన వాహనాలు తీసుకెళ్లి ప్రమాదాన్ని నియంత్రించలేకపోయినా సిబ్బందిపై చర్యలుంటాయి. కచ్చితంగా కండిషన్‌లో ఉన్న వాహనాలు, పరికరాలే తీసుకెళ్లాలి. ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి.

● మండలాలు, గ్రామాల పరిధిలో గుడిసెలు ఉన్న కాలనీలను సంబంధిత ఫైర్‌మ్యాన్‌, లీడింగ్‌ ఫైర్‌మ్యాన్లు దత్తత తీసుకుని ఎప్పటికప్పుడు ప్రమాద అవకాశాలున్న వీకర్‌ లొకేషన్లపై సమాచారం తెలుసుకోవాలి. అక్కడి ప్రజలకు ప్రమాదాలపై అవగాహన పర్చాలి.

● సర్పంచ్‌, వార్డుమెంబర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఎఫ్‌పీషాప్‌ డీలర్లు, విలేజ్‌ సర్వెంట్లు, పోస్ట్‌మాస్టర్లే కాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల ఫోన్‌ నెంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలి.

● తక్షణ చర్యల్లో భాగంగా పరికరాలతో కూడిన మిస్ట్‌ బుల్లెట్‌ అందుబాటులో ఉంచుకోవాలి.

● 101 ఎమెర్జెన్సీ నెంబర్‌, స్టేషన్‌ ఎస్టీడీ నంబర్‌తో పాటు ప్రజలు ఫోన్‌ చేస్తే వెంటనే స్పందించేలా స్టేషన్‌ అధికారులు, సర్వీస్‌ ప్రొవైడర్లు మొబైల్‌ ఫోన్‌ నెంబర్లు ఉన్న సిమ్‌లు యాక్టివేట్‌ చేసుకోవాలి.

● గ్రామాలు, మండలాలు, వార్డులు, మున్సిపాలిటీలు పరిధి ముఖ్య కూడళ్లు, హోటళ్లు, సచివాలయాలు, అంగన్‌వాడీ సెంటర్లు, కమ్యూని టీ హాళ్లు, దేవాలయాలు, హెల్త్‌ సెంటర్లు, ఎఫ్‌పీఎస్‌ డీలర్‌ షాపులు, రైతుబజారు, మార్కెట్లలో స్కూళ్లు, పోస్టాఫీస్‌లు, బ్యాంకులు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో సంబంధిత ఫైర్‌స్టేషన్‌ అధికారి మొబైల్‌ నెంబర్‌, స్టేషన్‌ నెంబర్‌, ఎమెర్జెన్సీ కాల్‌ 101 నెంబర్లు కనిపించేలా ప్రదర్శించాలి.

● జిల్లాలో గడ్డి ఇళ్లు, గుడిసెలు బాగా తగ్గాయి. పరిశ్రమలు, మాల్స్‌లో నిబంధనలు పాటించకపోవడం, సంబంధిత అగ్ని ప్రమాద పరికరాలు ఉండకపోవడం, అనుమతులు తెచ్చుకో కపోవడం వల్లే ఇటీవల ప్రమాదాలు సంభవించాయి. భారీ ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం ఎక్కడ సంభవిస్తుందోనని పలువురు ప్రమాదమని తెలిసినా చొరబడేందుకు చూస్తారు. అది మంచిది కాదు.

అత్యవసర నంబర్లు..

స్టేషన్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ మొబైల్‌ ఆఫీస్‌ నంబర్‌

శ్రీకాకుళం ఎం.వరప్రసాద్‌ 9963726782 08942222099

ఇచ్ఛాపురం కె.ప్రశాంత్‌కుమార్‌ 8317587461 08947231101

సోంపేట ఎస్‌ మోహన్‌ 9963744295 08947234101

పలాస బి.సోమేశ్వరరావు 9963730662 08945241101

టెక్కలి బి.సూర్యారావు 9000505945 08945244277

కోటబొమ్మాళి పి.ఆర్‌.రెడి 9963730845 08942238659

నరసన్నపేట ఎస్‌.వరహాలు 7680089447 08942276777

ఆమదాలవలస కె.అప్పారావు 9963730658 08942286401

కొత్తూరు ఎన్‌.బుచ్చోడు 9000873349 08946258444

రణస్థలం పి.అశోక్‌ 9963731326 08942234499

మందస పి.కృష్ణారావు 9440939909 08947237101

పొందూరు జి.ఇందుమతి 9491325930 08941242101

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం1
1/2

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం2
2/2

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement