కాశీబుగ్గ, మందస: మందస మండలం, గుడారి రాజమణిపురం సమీపంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శుక్రవారం ఉదయం సందర్శించారు. విద్యా ర్థులు అస్వస్థతకు గురి కావడంతో వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం విద్యాల యంలోని వంటగది, తరగతి గదులు, పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని వసతిగృహ అధికారిని అదేశించారు. విద్యార్థులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు వాటి పరిస్థితిని పరిశీలించి విద్యాలయం ఆవరణలో అదనంగా మరి కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భద్రత, రక్షణ పరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పలు ముఖ్యమైన అంశాలపై మందస ఎస్‌ఐకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్శనలో ఇచ్ఛాపురం సీఐ చిన్నంనాయడు, కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, స్థానిక ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్, విద్యాలయం అధికారులు, సిబ్బంది ఉన్నారు.