గార: ఖరీఫ్‌లో పండిన వరి గడ్డి దూర ప్రాంతాలకు తరలిపోతోంది. విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వర్తకులు వచ్చి ఎండు గడ్డిని కొనుగోలు చేసి ట్రాక్టర్ల, లారీల ద్వారా తరలించుకుపోతున్నారు. ఈ ఏడాది ప్రైవేటు డెయిరీలు పాల సేకరణ ధర తగ్గించడంతో పశువుల పెంపకం కూడా తగ్గుముఖం పడుతోంది. వచ్చే ఖరీఫ్‌కు ఉగాది తర్వాత భూములు సిద్ధం చేసుకోవాలని రైతాంగం సమాయత్తవుతున్న పరిస్థితుల్లో పొలాల్లో ఉన్న వరి గడ్డిని అమ్మివేస్తున్నారు. దీంతో స్థానిక పశువుల పెంపకందారుకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.