మెళియాపుట్టి: మండలంలోని గొప్పిలి గ్రామానికి చెందిన బి.యువరాజు అనే వ్యక్తి కిలో 250 గ్రాముల గంజాయితో శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించి పాతపట్నం సీఐ రామారావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. యువరాజు కొంతకాలంగా త్రినాథ మేళాల కోసం చిన్నమొత్తంలో గంజాయి విక్రయించేవాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం గండాహతి నుంచి గంజాయి తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచాడు. గురువారం సాయంత్రం ఒడిశాలోని రంప గ్రామంలో పెద్ద మొత్తంలో గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా ఎస్సై రమేష్‌బాబు సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు.