
పోగొట్టుకున్న సొమ్ము అప్పగింత
సారవకోట: మండ కేంద్రం సారవకోటలోని గ్రామీణ బ్యాంకు ఆవరణలో గత ఏడాది డిసెంబర్‌లో బొంతు గ్రామానికి చెందిన తంగుడు సురేష్ నగదు పోగొట్టుకున్నాడు. పొగొ ట్టుకున్న నగదులో లక్ష రూపాయలను గురువా రం స్థానిక పోలీసులు బాధితుడికి అప్పగించా రు. వివరాల్లోకి వెళ్తే.. బొంతు గ్రామానికి చెంది న సురేష్ గ్రామీణ బ్యాంకులో రూ 1.30 లక్ష లు నగదు జమ చేసేందుకు వచ్చి సొమ్మును బ్యాంకు కుర్చీపై పెట్టాడు. గుర్తు తెలియని వ్యక్తి నగదును బ్యాగ్ దొంగిలించుకుని పారిపోయాడు. ఇటీవల మందస పోలీసులు వేరే కేసు లో పలువురు నిందితులను పట్టుకోగా అందు లో సురేష్ నగదు దొంగిలించిన వ్యక్తి ఉండటంతో సొమ్ము రికవరీ చేశారు. రూ.లక్షను బాధి తుడికి హెచ్‌సీ శ్రీనివాసరావు అందజేశారు.
బిత్తరబందలో దొంగల హల్‌చల్
మందస: మండలంలోని సాబకోట గిరిజన పంచాయతీ బిత్తరబందలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. బుధవారం రాత్రి కారు, రెండు ద్విచక్ర వాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సవర మల్లిక అనేక మహిళపై దాడి చేసి చెవికి ఉన్న బంగారపు రింగులను పట్టుకుపోయారు. ఈ సమయంలో ఆమె ప్రతిఘటించగా కత్తితో దాడికి పాల్పడ్డారు. బాధితురాలిని స్థానికులు గుర్తించి 108 అంబులెన్సులో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
టెక్కలి : పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టెక్కలి వైఎస్సార్ జంక్షన్‌లో అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. అనంతరం లింగాలవలసలో గత వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మాణం చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టుమహ దేవి కోనేరు గట్టు అభివృద్ధిలో భాగంగా ట్యాక్సీ స్టాండును తక్షణమే తరలించాలని ఆదేశించారు. ట్యాక్సీ స్టాండు కోసం ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించామని, తక్షణమే ఆ ప్రదేశంలో వాహనా లు నిలుపుదల చేసుకోవాలని స్పష్టంగా చెశారు. ఈయనతో పాటు ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, నాయకు లు కె.హరివరప్రసాద్, కె.కిరణ్, బి.శేషు పాల్గొన్నారు.
అటెండర్ అనుమానాస్పద మృతి!
నరసన్నపేట: స్థానిక మారుతీనగర్–1లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న కొర్రాయి రమణమూర్తి (55) అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు సమాచారం. ఈయన టెక్కలి వంశధార కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. సోమవారం నుంచి ఆయన కనిపించడం లేదు. ఆయన వినియోగించే ద్విచక్ర వాహనం కూడా ఇంటి బయటే ఉంది. గురువారం సాయంత్రం ఇంటి లోపల నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇంటి తలుపులు తీసేందుకు ప్రయత్నించగా లోపల గడియ పెట్టి ఉండటంతో వెనక్కి వచ్చేశారు. అనంతరం కుటుంబస భ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. రమణమూర్తి కుమార్తెకు వివాహం కాగా, కుమారు డు విశాఖలో ఒక ప్రవేటు కంపెనీలో పనిచేస్తున్నారు.
బైపీసీ విద్యార్థులకు అవకాశం
శ్రీకాకుళం రూరల్: ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు పారామెడికల్ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్‌టీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 19లోగా దర ఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం కల్పించి ఫీజును జీతంలో మినహాయిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9121999654, 76809 45357 నంబర్‌ను గానీ, రాగోలు జెమ్స్ ఆసుపత్రి లోని బొల్లినేని మెడిస్కిల్స్‌ను గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

పోగొట్టుకున్న సొమ్ము అప్పగింత

పోగొట్టుకున్న సొమ్ము అప్పగింత