
అక్రమంగా గ్రావెల్ తరలింపు
సారవకోట: మండలంలోని జమచక్రం గ్రామం నుంచి సత్రాం పంచాయతీ గొల్లపేట వెళ్లే మార్గంలో సర్వే నంబర్ 42 కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. ఈ మార్గంలో కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు వినియోగించుకునేందుకు సంబంధిత కాంట్రాక్టర్లు పక్కనే ఉన్న కొండ నుంచి గ్రావెల్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా తరలించుకుంటున్నారు. ప్రస్తుతం అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న కొండ నుంచి సచివాలయం కూత వేటులోనే ఉన్నా సంబంధిత రెవెన్యూ సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరించడం విచారకరం. దీనిపై స్థానిక వీఆర్వో రామును వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు.