
ఫిట్‌లెస్ సెంటర్
శ్రీకాకుళం రూరల్:
ఇటీవల ఓ ప్రైవేట్ బస్సు కొందరు పాసింజర్లతో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వస్తుండగా మార్గమధ్యంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో తుప్పల్లోకి దూసుకుపోయింది. దీంతో ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలయ్యాయి. అంతకు వారం రోజు ల కిందటే బస్సుకు ఫిట్‌నెస్ పరీక్ష చేయించినట్లు డ్రైవర్ తెలిపారు. ఆరా తీస్తే ఆ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది శ్రీకాకుళం శివారులోని ఓ ఫిట్‌నెస్ సెంటర్ అని తెలిసింది. ఎవరూ టెస్ట్ డ్రైవ్ చేయకుండా, మిషన్లతో పూర్తిస్థాయిలో పరీక్షించకుండా కేవలం మాన్యువల్‌గా పరీక్షించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇదే ప్రమాదానికి కారణం.
ఆర్టీఏ అధికారులెక్కడ..?
ఒకప్పుడు బస్సుకు గానీ, లారీలకు గానీ చివరికి ఆటోలకు సైతం ఫిట్‌నెస్‌లు చేయించాలంటే నేరు గా అనుభవం ఉన్న ఆర్టీఏ అధికారి ఆ వాహనాన్ని కొంతమేర డ్రైవింగ్ చేసేవారు. తర్వాతే సర్టిఫికెట్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రైవేట్ యాజమాన్య సంస్థలు లోపాలు గుర్తించడం లేదు. నామమాత్రంగా కొన్ని టెస్టులు చేసి అనుమతులు ఇచ్చేస్తున్నారు. నగరంలోని నాగావళి నదీ తీరాన, ఫాజుల్‌బేగ్ ప్రాంతం అగ్రికల్చర్ కార్యాలయం పరిధిలో వాహ న ఫిట్‌నెస్ సెంటర్లకు కొన్ని నెలల కిందట అనుమతులు ఇచ్చారు. ఇక్కడ వివిధ రకాలైన ట్రాన్స్‌పోర్టు (ఎల్లోబోర్డు) వాహనాలన్నింటికీ మిషనరీతోనే బండి కండీషన్‌లకు పర్మిషన్లు ఇస్తున్నాయి. ఇక్కడ అనుభజ్ఞులైన ఆర్టీఏ అధికారులంటూ ఎవ్వరూ లేరు. ప్రైవేట్ యాజమాన్య సంస్థ పెట్టుకున్న సిబ్బందితోనే తూతూ మంత్రంగా వాహనాలకు ఫిట్‌నెస్‌లు జారీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఫిట్‌నెస్ సెంటర్‌లు ఏర్పాటు చేసినప్పటికీ ఆటో నుంచి తోక లారీ వరకూ ఎలాంటి వాహనానికై నా ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని అనుమతులు ఆ ప్రైవేట్ యాజమాన్య సంస్థే ఫిట్‌నెస్‌లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఆర్టీఎ అధికారుల పాత్ర, అప్రూవుల్ అంటూ ఏమీ లేకుండా పోయింది.
ఏజెంట్లకు పండగే
ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఫిట్‌నెస్ సెంటర్ ఏర్పాటు కావడంతో ఏజెంట్ల ఆశలు చిగురించాయి. వారు ఇచ్చిన టోకెన్ నంబర్ ఆధారంగానే ఏదైనా బండికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు త్వరితగతిన వచ్చేస్తున్నాయి. పొరపాటున నేరుగా ఆన్‌లైన్ ద్వారా ఎఫ్‌ఫీకు సంబంధించిన స్లాట్‌ను వాహన యజ మాని బుక్ చేసుకుంటే అది పూర్తిగా ఫెయిల్ అవ్వాల్సిందే. ప్రభుత్వ ఆధీనంలో ఫిట్‌నెస్‌లు ఇచ్చేటప్పుడు మాత్రం ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒకసారి స్లాట్ బుక్ చేసుకుంటే రెండోరోజుకు కూడా మా ర్చుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఫిట్‌నెస్ సెంటర్‌లో ఆ పరిస్థితి లేకుండా పోయింది.
భారీ దోపిడీ
కేంద్రంలో వివిధ రకాలైన వాహనాలపై భారీ దోపిడీ జరుగుతోంది. ఇదంతా ఏజెంట్ల ద్వారానే కమిషన్ పద్ధతిలో నడుస్తోంది. స్థానికంగా ఏర్పాటు చేసిన రేట్లు కంటే అధిక రేట్లకు ముందస్తుగానే ఏజెంట్ ద్వారా డబ్బులు లాగేస్తున్నారు.
ఒక్క రోజులోనే నంబర్ ప్లేట్ల జారీ
వాస్తవంగా ఏదైనా బండి ఫిట్‌నెస్ కేంద్రానికి వెళ్తే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌లు తప్పనిసరి. ఇది బండి కొన్న నెలరోజులకే షోరూంకు వస్తుంది. కానీ ఫిట్‌నెస్ కేంద్రంలో ఒక్క రోజులోనే నంబర్ ప్లేట్‌ను ఏర్పాటు చేస్తూ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటితో పాటు రూ. 20 విలువ చేసే రిఫ్లెక్టివ్ రెడ్ టేపును బండికి అంటించడానికి రూ. 300 నుంచి రూ.500 వరకూ దోచేస్తున్నారు.
శ్రీకాకుళం శివారులో వాహన ఫిట్‌నెస్ సెంటర్
ఏజెంట్ కోడ్‌తో బుక్ చేసుకుంటేనే ఫిట్‌నెస్ మంజూరు
ఆర్టీఏ అధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థ పేరుతో పత్రాల జారీ
పట్టించుకోని రవాణాశాఖ అధికారులు
ఫిర్యాదులు మా దృష్టికి వస్తున్నాయి
ఫిట్‌నెస్ కేంద్రంపై ఫిర్యాదులు వస్తున్నాయి. గ తంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నపుడు బండి కండీషన్ చూస్తూ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు అందించేవాళ్లం. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ప్రైవేట్ పరం చేశారు. మా పాత్ర అంటూ ఏమీ లేదు. – విజయ సారథి, డీటీసీ
టోకెన్ తీసుకున్నాం
ఆటో ఫిట్‌నెస్ కోసం ఏజెంట్‌కు రూ.3000 డబ్బులు ఇచ్చి ఫిట్‌నెస్ టోకెన్ తీసుకున్నాం. ఉదయం 10 గంటలకు ఫిట్‌నెస్ కేంద్రంలో బండి పెట్టాను. మధ్యాహ్నం 3 గంటలకు బండి ఇచ్చారు. గతంలో ప్రభుత్వ ఆధీనంలో బండి ఫిట్‌నెస్ చేసుకుంటే రూ.1000తోనే సరిపోయేది. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ఇక్కడ ప్రతి దానికి అధికంగా డబ్బులు కట్టాల్సిందే. – మురళి, ఆటో డ్రైవర్

ఫిట్‌లెస్ సెంటర్

ఫిట్‌లెస్ సెంటర్

ఫిట్‌లెస్ సెంటర్