సాక్షి, బెంగళూరు: మాజీ కాంగ్రెస్ జిల్లాధ్యక్షుడు రవిగౌడ పాటిల్ దూళఖేడ మొబైల్‌ఫోన్ నుంచి కొన్ని అశ్లీల ఫోటోలు వాట్సప్ గ్రూప్‌లోకి వెళ్లడం వైరల్‌గా మారింది. అతని ఫోన్ నుంచి కొన్ని నీలిచిత్రాలు విజయపుర డీసీసీ ప్రెస్ గ్రూప్‌లో అప్‌లోడ్ అయ్యాయి. గ్రూప్‌లోని సభ్యులందరూ ఈ చిత్రాలను చూసి అవాక్కయ్యారు. ఇదేం బాగాలేదని గ్రూప్‌లోని కొందరు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ దీనికి పాటిల్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
దీనిని గమనించిన గ్రూప్ అడ్మిన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వసంతహొనమాడే, రవిగౌడ పాటిల్‌ను గ్రూప్ నుంచి తొలగించారు. ఆదివారం ఉదయం రవిగౌడ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ క్షమాపణ కోరారు. శనివారం రాత్రి ఇంట్లో ముఖం కడుక్కోవడానికి వెళ్లిన సమయంలో చిన్నపిల్లలు మొబైల్ తీసుకుని ఆడుకుంటున్నారు. ఈ సమయంలో ఫోటోలు వెళ్లి ఉండవచ్చు, అందరూ నన్ను క్షమించాలని పాటిల్ సంజాయిషి ఇచ్చారు. చిన్నపిల్లలు అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తారంటే నమ్మశక్యంగా లేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. (పోర్న్‌సైట్లలో విద్యార్థినులు, లెక్చరర్ల ఫోటోలు)
Comments
Please login to add a commentAdd a comment