
మాట్లాడుతున్న జిల్లా తపాలా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు
హుజూర్‌నగర్: ఆధార్ కార్డులో తప్పుల సవరణ, బయోమెట్రిక్ నమోదును పోస్టాఫీసులో చేసుకోవచ్చని జిల్లా తపాలా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లోని తపాలా కార్యాలయంలో గ్రామీణ తపాలా ఉద్యోగులకు ఐపీపీబీ మొబైల్‌లో సీఈఎల్‌సీ యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రతి ప్రభుత్వ పథకానికి ఆధార్ కార్డ్ ప్రధానమని చెప్పారు. గ్రామీణ తపాలా ఉద్యోగులను ఈ యాప్‌కు ఆపరేటర్లుగా నియమించినట్లు తెలిపారు. ఇక నుంచి అప్పుడే పుట్టిన పిల్లలకూ ఆధార్ నమోదు చేసుకోవచ్చని, ఆధార్‌లో తప్పుల, బయోమెట్రిక్ సవరణతోపాటు, మొబైల్ నంబర్ లింక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి సేవలకు నామమాత్రంగా రూ.50 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పిల్లల ఆధార్ నమోదును ఉచితంగా చేయడం జరుగుతుందని ప్రతి పోస్టాఫీస్‌లో ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తపాలా అధికారులు రాజేష్ రెడ్డి, సందీప్, ఉద్యోగులు కోటయ్య, మతీన్, గ్రామీణ తపాలా ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment