తాగునీటి సమస్య రావొద్దు
ఫ అధికారులు మనసు పెట్టి పనిచేయాలి
ఫ నీటి సమస్య తలెత్తితే
తక్షణమే పరిష్కరించాలి
ఫ అందుకు కలెక్టర్ వద్ద నిధులు
ఉంచుతాం
ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
ఫ మంత్రి కోమటిరెడ్డితో కలిసి నల్లగొండలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష
నల్లగొండ : వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా అధికారులు మనసు పెట్టి పనిచేయాలని ఉమ్మడిజిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్‌లో సాగు, తాగునీరు, విద్యుత్‌పై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ వేసవిలో తాగు, సాగు నీరు, విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఫిబ్రవరిలో సమావేశం నిర్వహించుకోవాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందన్నారు. ఈ మూడు శాఖలకు చెందిన పైస్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందులో పోలీస్, రెవెన్యూ అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. వేసవిలో ఏర్పడే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్ల వద్ద కొంత నిధి ఏర్పాటు చేస్తామన్నా రు. ఎమ్మెల్యేల వద్ద కూడా నిధులు అందుబాటులో ఉంచేలా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టు నుంచి గోదా వరి జలాలను కృష్ణాతో అనుసంధానం చేసే ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. డీఆర్‌సీ సమావేశాలు నిర్వహించుకునే విషయంలో కూడా అధికారులు దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై అధి కారులు క్షేత్ర స్థాయికి వెళ్లి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లు వీటిపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు.
కాల్వల నిర్వహణ సరిగాలేదు : గుత్తా
శాసనమండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల నిర్వహణ సరిగా లేదన్నారు. ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ చేపట్టాలన్నారు. కాల్వల్లో రైతులు పెద్ద మోటార్లు వేసి నీటిని లాగడం వల్ల చివరి భూములకు నీరు అందడం లేదన్నారు. విద్యుత్ కనెక్షన్ల మంజూరులో అధికారులు ఆచితూచి వ్యవహరించాలని సూచించారు.
నీరు వదిలి పంటను కాపాడాలి
ఎస్సారెస్పీ నీరు సరిగా అందక పంట పొలాలు ఎండిపోయి. మా ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నీటిసి సక్రమంగా విడుదల చేసి ఆ పంటలను కాపాడాలి. అడ్డగూడూర్‌లో అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ చేయడం లేదు. మోత్కూర్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలి.
– తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్
అధికారుల మధ్య సమన్వయం లేదు
వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల నీటి విడుదల విషయంలో స్పష్టత లేదు. అధికారులు ఒకరికొకరు సహకరించుకుని సమస్యలు పరిష్కరించాలి.
– కోదాడ ఎమ్మెల్యే పద్మావతి
తాగునీటి సమస్య రావొద్దు
తాగునీటి సమస్య రావొద్దు
తాగునీటి సమస్య రావొద్దు
Comments
Please login to add a commentAdd a comment