కాంగ్రెస్ కక్షసాధింపు వల్లే రైతులకు నీటికష్టాలు
నూతనకల్: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల కారణంగానే రైతులకు సాగునీటి కష్టాలు వచ్చాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. నూతనకల్ మండల కేంద్రంలో ఎండిపోయిన పంట పొలాలను, శ్రీరాంసాగర్ కాల్వలను శనివారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్.. గోదావరి జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే ప్రాజెక్టులో లోపాలున్నాయని నీటిని లిప్టు చేయకుండా రైతులను అరిగోస పెట్టిస్తున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాళేశ్వరం పంప్‌లను నడిపి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పంటలు ఎండిపోయిన రైతులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నూతనకల్, మద్దిరాల బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్య, ఎస్‌ఏ రజాక్, గుజ్జ యుగేంధర్‌రావు, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్‌నాయక్, బత్తుల సాయిలుగౌడ్, బిక్కి బుచ్చయ్య, బత్తుల విద్యాసాగర్, బత్తుల విజయ్, ఇమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, బాణాల సత్యనారాయణరెడ్డి, కనకటి మహేష్, పంతం యాకయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి
గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment