లో వోల్టేజీ సమస్యల పరిష్కరించాలి : మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉన్నాయని.. ఎకరం పొలం కూడా ఎండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ లోడ్ పెరిగి లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోందని.. ఆ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. కలెక్టర్లు తాగునీటిపై దృష్టి సారించాలని, ప్రతి పంచాయతీకి రూ.15 వేల వరకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నంద్‌లాల్ పవార్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్‌సీ హరిలాల్, సీఈ అజయ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ వెంకటేశ్వర్లు, నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment