నేడే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 77 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. 4 గంటల్లోపు పోలింగ్ కేంద్రం గేటు లోపల ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. నాలుగు గంటల తరువాత వచ్చే వారిని అనుమతించరు. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది పోటీలో ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలకు చేరిన పోలింగ్ సిబ్బంది
నల్లగొండ జిల్లా కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను రెండు రోజులుగా ముందుగానే అధికారులు ఆయా జిల్లాలకు తీసుకెళ్లారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బుధవారం పోలింగ్ బ్యాలెట్ బాక్సులతోపాటు బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామగ్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో పోలీసుల భద్రత నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
బాక్సులన్నీ నల్లగొండకే....
పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులన్నీ నల్లగొండలోని ఆర్జాలబావి రిసెప్షన్ సెంటర్‌కు వస్తాయి. 27వ తేదీన రాత్రి 8 గంటల నుంచి పోలింగ్ బాక్సులు రిసెప్షన్ సెంటర్‌కు చేరుకుంటాయి. మరుసటి రోజు (28వ తేదీ) ఉదయం వరకు వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి కొన్ని పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌కు చేరే అవకాశం ఉంది. గట్టి బందోబస్తు మధ్య పోలింగ్ బాక్సులను నల్లగొండకు తెప్పించనున్నారు. ఆర్జాలబావి గోదాములోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో రాజకీయ ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచనున్నారు. వచ్చే నెల 3వ తేదీన నల్లగొండలోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మూడు జిల్లాల్లో ఓటర్లు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 8,331 మంది ఉన్నారు. వీరిలో నల్లగొండ జిల్లాలో 4,683 మంది , సూర్యాపేట జిల్లాలో 2664 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 984 మంది ఓటర్లు ఉన్నారు.
ఫ ఉదయం 8 గంటల నుంచి
సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో
77 పోలింగ్ కేంద్రాలు
ఫ 72 సాధారణ, 5 సమస్యాత్మక
పోలింగ్ కేంద్రాలు
ఫ ఉమ్మడి జిల్లాలో ఓటర్లు 8,331 మంది
నేడే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment