ఎల్‌ఆర్‌ఎస్‌కు రాయితీ
ఫ క్రమబద్ధీకరణ ఫీజు, ఖాళీ స్థలాల చార్జీల్లో 25 శాతం రాయితీ
కల్పించిన ప్రభుత్వం
ఫ మార్చి31వరకు ప్రక్రియ పూర్తి
చేసుకుంటేనే ప్రయోజనం
ఫ ఐదు మున్సిపాలిటీల పరిధిలో 52,394 దరఖాస్తులు పెండింగ్
తిరుమలగిరి (తుంగతుర్తి): జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (ఎల్‌ఆర్‌ఎస్) పరిష్కార ప్రక్రియ వేగవంతం కానుంది. నాలుగు సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా క్షేత్ర స్థాయిలో ఆశించిన స్థాయిలో స్పందన లేక పోవడంతో ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరణ ఫీజు, ఖాళీ స్థలాల చార్జీలకు 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.
ఇప్పటి వరకు స్పందన అంతంతే..
2020లో అప్పటి ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఆ తరువాత వాటిని పరిష్కరించకుండా వదిలేయడంతో గత ఏడాది నుంచి మళ్లీ చర్యలు ప్రారంభించారు. అయినా దరఖాస్తుదారుల్లో ఆసక్తి కనిపించకుండా పోయింది. మున్సిపాలిటీ అధికారులు ఫోన్‌లు చేసి స్థలాలు చూపించాలని కోరుతున్నా దరఖాస్తుదారులు పట్టించుకోలేదు. ఫీజు చెల్లించే వారే రాక పోవడంతో ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ఆలోచన చేసి ఎలాగైనా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ఆలోచించి వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ప్రారంభించారు. రాయితీ అవకాశం రావడంతో ఇప్పుడిప్పుడే వారు ముందుకు వస్తున్నారు.
దృష్టి సారిస్తే ఆదాయం
మున్సిపాలిటీ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌పై దృష్టి సారిస్తే భారీ ఆదాయం సమకూరనుంది. ఫీజుతో పాటు ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ తేదీ నాటికి మార్కెట్ విలువలో 14 శాతం ఖాళీ స్థలాల చార్జీలపై ఈ రాయితీ లభించనుంది. ప్రభుత్వ ప్రకటనతో దరఖాస్తుదారులు చెల్లించాల్సిన మొత్తంలో 4వ వంతు మినహాయింపు వచ్చినట్లేనని చెబుతున్నారు. మార్చి 31 లోపు చెల్లించే వారికే 25 శాతం రాయితీ వర్తించనుంది. ఆ తరువాత వారికి రాయితీ రాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
32 రోజులే సమయం..
జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల పరిధిలో 65,209 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 12,815 దరఖాస్తులు పరిష్కారం అయ్యాయి. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు సరైన ఆధారాలు చూపి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డబ్బులు చెల్లించి స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చు. 25 శాతం రాయితీని పొందవచ్చు.
మున్సిపాలిటీలు ఐదు
వచ్చిన దరఖాస్తులు 65,209
పరిష్కారం అయినవి 12,815
పెండింగ్‌లో ఉన్నవి 52,394
Comments
Please login to add a commentAdd a comment