ట్యాబ్‌లతో బోధన
చిలుకూరు: విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్ల సరఫరాను ప్రారంభించగా , జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులను సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి శ్రీ యోజన (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా పథకం)లో భాగంగా విద్యార్థులకు సరి కొత్తగా ట్యాబ్‌ల ద్వారా బోధన చేయనున్నారు. బోర్డుపై బోధించే అంశాలను నేరుగా చూసేలా ఈ అవకాశం కల్పించనున్నారు. ఇందుకు కోసం ఎంపికై న ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్‌లు త్వరలో పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా 550 ట్యాబ్‌లు..
పీఎంశ్రీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రారభించింది. ఈ పథకం కింద ఎంపికై న పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. 2026–27 నాటికి ఎంపికై న పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి హంగులు సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ పథకం కింద నిధులు మంజూరు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 950 ప్రభుత్వ పాఠశాలలు, 9 మోడల్ స్కూళ్లు, 18 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో మొదటి విడతలో ఈ పథకం కింద 22 పాఠశాలలు, రెండో విడతలో తొమ్మిది పాఠశాలలు ఇలా మొత్తం 31 పాఠశాలలు ఎంపికయ్యాయి. ప్రస్తుతం మొదటి విడతలో ఎంపికై న 22 పాఠశాలలకు ఒక్కో బడికి 25 ట్యాబ్‌ల చొప్పున 550 ట్యాబ్‌లు సరఫరా చేయనున్నారు. వీటిని 8,9,10 తరగతుల విద్యార్థులకు అందించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటి ద్వారా పాఠాలు బోధించనున్నారు. పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలను ఈ ట్యాబ్‌లలో విద్యార్థులకు చూపించనున్నారు.
ఫ పీఎంశ్రీ కింద మొదటి
విడత ఎంపికై న 22 స్కూళ్లకు త్వరలో ట్యాబ్‌లు
ఫ ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్‌లు
ఫ వచ్చే విద్యాసంవత్సరం
నుంచి అమలు
Comments
Please login to add a commentAdd a comment