భువనగిరి : బస్వాపూర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఏడుళ్లు కావస్తున్నా నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్‌లో భాగంగా భువనగిరి మండలం వడపర్తి పరిధిలో వాగు చెరువు, చోక్లతండా వద్ద నిర్మిస్తున్న కాల్వలను బుధవారం ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. నిర్వాసితుల కోసం తక్షణమే రూ.300 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే బస్వాపూర్ ప్రాజెక్టు నుంచి వడపర్తి కత్వ వరకు కాల్వను పూర్తి చేసేందుకు రూ. 6 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇందుకోసం జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. వడపర్తి కత్వ నింపితే భువనగిరి, బీబీనగర్ మండలాల పరిధిలోని చెరువుల్లోకి నీరు చేరి వందలాది ఎకరాలు సాగవుతుందన్నారు. నిధులు విడుదల చేయని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, నాయకులు ఏదునూరి మల్లేశం, మైసయ్య,అంజనేయులు, మాణిక్యం, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment