స్వర్ణగిరిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
భువనగిరి : పట్టణంలోని స్వర్ణగిరి ఆలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం కూడా కొనసాగాయి. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆయనకు ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. అంతకు ముందు ఆలయంలో చతుస్థానార్చన మూర్తి కుంభం హోమం, హయాగ్రీవ ఇష్టి హవనం, అనంతరం అశ్వవాహన సేవ, ఆలయ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మానేపల్లి రామారావు, ధర్మకర్తలు మురళీకృష్ణ, గోపి కృష్ణ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment