ఓటెత్తిన ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన ఉపాధ్యాయులు

Published Fri, Feb 28 2025 1:24 AM | Last Updated on Fri, Feb 28 2025 1:24 AM

ఓటెత్

ఓటెత్తిన ఉపాధ్యాయులు

టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉమ్మడి జిల్లాలో 94.98 శాతం పోలింగ్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉపాధ్యాయ ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 10 గంటల వరకు మందకొడిగా వచ్చిన ఓటర్లు ఆ తరువాత అధిక సంఖ్యలో వచ్చారు. గంట గంటకు ఓటర్ల రాక పెరిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ భారీగా నమోదైంది. మొత్తానికి నిర్దిష్ట సమయానికే సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 94.98 శాతం పోలింగ్‌ నమోదైంది.

పోలింగ్‌ కేంద్రాల వద్ద సంఘాల హడావుడి

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆయా అభ్యర్థులకు సంఘాలు, అనుచరులంతా టెంట్‌లు వేసుకుని పోల్‌చిట్టీలు అందించారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు.. వారి ఓటు ఏ బూత్‌లో ఉందనేది జాబితాలో చూసి పోల్‌ చిట్టీలు అందజేశారు. ఆయా అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు, సంఘాల నాయకులు టెంట్లు ఏర్పాటు చేసుకుని కూర్చున్నారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులతో పాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు, ఆర్ముడ్‌ రిజర్వు పోలీసులతో ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు.

వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా అదనపు కలెక్టర్‌ పరిశీలన

జిల్లాలో 23 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్‌ సరళిని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్‌ శాతాన్ని తెలుసుకున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని అదనపు కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరాజు, ఈడీఎం గఫార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫ పోలింగ్‌ కేంద్రాలకు

బారులుతీరిన ఓటర్లు

ఫ మధ్యాహ్నం 2 గంటల వరకే

76 శాతం నమోదు

ఫ 4 గంటల వరకు ముగిసిన పోలింగ్‌

ఫ పోలింగ్‌ కేంద్రాలను

సందర్శించిన కలెక్టర్‌, ఎస్పీ

ఫ నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న బ్యాలెట్‌ బాక్సులు

ఉమ్మడి జిల్లాలో పోలింగ్‌ శాతం ఇలా..

జిల్లా మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు శాతం

యాదాద్రి 984 950 96.54

సూర్యాపేట 2664 2530 94.97

నల్లగొండ 4683 4433 94.66

No comments yet. Be the first to comment!
Add a comment
ఓటెత్తిన ఉపాధ్యాయులు1
1/2

ఓటెత్తిన ఉపాధ్యాయులు

ఓటెత్తిన ఉపాధ్యాయులు2
2/2

ఓటెత్తిన ఉపాధ్యాయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement