ఇంకా.. కొత్త సంఘాలు
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సభలు, సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటిస్తున్నారు. దీంతో తమకు ఆర్థిక భరోసా లభిస్తుందని గ్రామీణ ప్రాంత మహిళలు ఆశతో ఎదురు చూస్తున్నారు. మహిళలను ఆర్థికంగా స్థితిమంతులను చేయాలనే లక్ష్యంతో దశాబ్దాల క్రితం మహిళా పొదుపు స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వాలు దశల వారీగా కృషి చేశాయి. దీంతో గ్రామాల్లో 80 శాతం ఇళ్లలో కనీసం ఒక్కరైన మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరి బ్యాంకుల నుంచి వస్తున్న రుణాలతో పాటు ప్రభుత్వం నుంచి లభించే వివిధ రాయితీ పథకాలను మహిళా సభ్యులు అందిపుచ్చుకున్నారు. తక్కువ వడ్డీ, ఒక్కోసారి వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందారు. ప్రస్తుతం ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా మరికొన్ని సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 5,280 మంది సభ్యులతో 165 కొత్త సంఘాలను నెలకొల్పారు. దీంతో జిల్లాలో మొత్తం 17,579 సంఘాలు అయ్యాయి. వీటిలో 1,83,782 మంది మహిళా సభ్యులు ఉన్నారు.
నిర్వహణపై శిక్షణ
కనీసం పది మంది సభ్యులతో ఏర్పాటైన కొత్త సంఘాల సభ్యులకు ఆయా సంఘాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా డబ్బులు పొదుపు చేయడంతో పాటు అందుకు సంబంధించిన రికార్డుల నిర్వహణ, బ్యాంకుల ద్వారా వచ్చే రుణాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. సభ్యులు తీసుకున్న ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని, తిరిగి చెల్లింపు అంశాలపై కూడా ఆర్పీలు, సీఏలు సంఘాల వారీగా శిక్షణ ఇస్తున్నారు.
ఫ జిల్లాలో నూతనంగా 165 స్వయం సహాయక సంఘాల ఏర్పాటు
ఫ 5,280 మంది మహిళలకు
సభ్యులుగా అవకాశం
ఫ వనితల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment