పెన్షనర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా
హుజూర్‌నగర్ : ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం హుజూర్‌నగర్‌లోని మంత్రి నివాసంలో ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతికోత్సవాల పోస్టర్‌ను ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కోదాడలో వచ్చేనెల 16, 17, 18 తేదీల్లో ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతికోత్సవాలు నిర్వహించాలనుకోవడం సాహసోపేతమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, సంఘం నాయకులు దేవదానం, ఎంఎస్‌ఎన్ రాజు, వీరబాబు, చంద్రశేఖర్, తాటి ప్రభాకర్ రెడ్డి, చంద్రయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment