నేడు భానుపురి సైన్స్ సంబరాలు
సూర్యాపేటటౌన్ : సైన్స్ డే సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం భానుపురి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు గోళ్ళమూడి రమేష్ బాబు తెలిపారు. సూర్యాపేటలో సైన్స్ సంబరాల పోస్టర్లను గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. మిరాకిల్ స్ట్రీట్ సైన్స్ షో, విజ్ఞాన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాజెక్టుల ప్రదర్శన, సైన్స్ స్కిట్స్, ముఖాభినయాలు తదితర విజ్ఞానాత్మక కార్యక్రమాలు ఉంటాయన్నారు. జనవిజ్ఞాన వేదిక, సూర్యాపేట సైన్స్‌ఫోరం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సైన్ సంబరాల్లో అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు ఉచితంగా పాల్గొనవచ్చని సూచించారు. గత ఆదివారం ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నట్లు కన్వీనర్ తల్లాడ రామచంద్ర తెలిపారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు షేక్ జాఫర్, సీనియర్ నేతలు నారాయణరెడ్డి, డి.నాగరాజు, ఉపేందర్, సోమ సురేష్ కుమార్, క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment