పోలింగ్ సరళి పరిశీలన
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఏవీఎం స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ పోలింగ్ కేంద్రంలో 991 ఓట్లకు గాను 935 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,664 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే చివ్వెంల మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ రవి, తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment