ఇంటింటా సౌరకాంతులు | - | Sakshi
Sakshi News home page

ఇంటింటా సౌరకాంతులు

Published Sat, Mar 1 2025 7:41 AM | Last Updated on Sat, Mar 1 2025 7:38 AM

ఇంటిం

ఇంటింటా సౌరకాంతులు

హుజూర్‌నగర్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజన పథకంతో ఇంటింటా సౌర విద్యుత్‌కాంతులు వెదజల్లుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న ఇళ్ల యజమానుల్లో 96.27 శాతం మంది తమ ఇళ్లపై సౌర విద్యుత్‌ ప్యానళ్లను ఏర్పాటు చేసుకున్నారు. వీటిని విద్యుత్‌ అధికారులు పరిశీలించి వినియోగానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మిగతా వారు ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ సబ్సిడీ ఇలా

ఒక్కో కుటుంబం 1 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కిలోవాట్‌ సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.80 వేలు ఖర్చు వస్తుండగా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూ.30 వేలు లభిస్తుంది. 2 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.1.60 లక్షల ఖర్చు వస్తుండగా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూ.60 వేలు లభిస్తుంది. 3 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.2.10 లక్షల ఖర్చు వస్తుండగా కేంద్రం నుంచి సబ్సిడీ రూ.78 వేలు లభిస్తుంది. 3కిలోవాట్ల సామర్థ్యం ప్యానల్‌ ద్వారా నెలకు 400 నుంచి 500 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. 5 కిలోవాట్ల ప్యానల్‌ ఏర్పాటు చేసుకుంటే రూ.3.20 లక్షలు ఖర్చు అవుతుంది. రూ.78 వేలు రాయితీ లభిస్తుంది. నెలకు 600యూనిట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. వినియోగదారులువాడుకోగా మిగిలిన ఆ కరెంట్‌ను విద్యుత్‌ శాఖ కొనుగోలు చేసి యూనిట్‌కు రూ.3.25ల చొప్పున ఆరు నెలలకు ఒకసారి నగదు చెల్లిస్తుంది.

ఇలా.. దరఖాస్తు చేసుకోండి..

సౌర విద్యుత్‌ ప్యానళ్ల ఏర్పాటు చేసుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగత వివరాలు, సెల్‌ నంబర్స్‌ తర్వాత ఓటీపీ, ఆ తర్వాత ఇంటి విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్‌ వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తులను విద్యుత్‌ శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఆ శాఖ సిబ్బంది దరఖాస్తుదారుల ఇంటికీ వెళ్లి పరిశీలించి సౌర విద్యుత్‌ ప్యానెళ్ల ఏర్పాటుకు సాంకేతిక అనుమతులు జారీ చేస్తారు. నచ్చిన కంపెనీని ఎంపిక చేసుకుంటే వారి సిబ్బంది వచ్చి ప్యానల్‌ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాలో రాయితీ సొమ్ము జమ అవుతుంది.

పర్యావరణానికి మేలు కలుగుతుంది

సోలార్‌ విద్యుత్‌ ప్యానల్‌ ఏర్పాటు చేసుకోవడం వల్ల సూర్యరశ్మితో విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవచ్చు. సోలార్‌ విద్యుత్‌ వినియోగం వల్ల కరెంట్‌ బిల్లుల ఖర్చు తప్పుతుంది. వినియోగదారులు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. సోలార్‌ విద్యుత్‌ విని యోగం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎంతో విలువైన భూగర్భ ఖనిజాలను మనం పరిరక్షించుకోచ్చు.

– వెంకటకిష్టయ్య,

విద్యుత్‌ డీఈ, హుజూర్‌నగర్‌

పీఎం సూర్యఘర్‌ పథకం కింద సబ్సిడీపై సోలార్‌ యూనిట్లు

ఫ 1 నుంచి 6 కిలోవాట్ల

సామర్థ్యం వరకు ప్యానళ్లు

ఫ అర్జీదారుల్లో ఇప్పటికే 96శాతం

మంది ఇళ్లపై ఏర్పాటు

ఫ పరిశీలించి వినియోగానికి

గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్న విద్యుత్‌ శాఖ

అర్జీలు ఇలా..

దరఖాస్తు చేసుకున్న వారు 537

ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంది 517

పురోగతిలో ఉన్న ప్యానళ్లు 20

జాతీయ బ్యాకుల నుంచి రుణసదుపాయం

సౌర విద్యుత్‌ ప్యానల్స్‌ కావాలనుకునే వినియోగదారులకు ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోతే అటువంటి వారికి జాతీయ బ్యాంకుల నుంచి రుణం ఇస్తారు. ఆర్థిక సహాయం కావాలనుకునే వారు సదరు ప్యానల్‌ ఏర్పా చేసే కంపెనీ వారు జాతీయ బ్యాంకుల అధికారులతో మాట్లాడి ఆయా బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తారు. తర్వాత వినియోగదారుడు తీసుకున్న సదరు రుణాన్ని బ్యాంకుకు వాయిదాల రూపంలో సక్రమంగా చెల్లించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇంటింటా సౌరకాంతులు1
1/2

ఇంటింటా సౌరకాంతులు

ఇంటింటా సౌరకాంతులు2
2/2

ఇంటింటా సౌరకాంతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement