8న జాతీయ లోక్ అదాలత్
చివ్వెంల: సూర్యాపేట జిల్లా కోర్టులో ఈనెల 8న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్‌శ్రీ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. చిన్న చిన్న ఘర్షణలతో కోర్టుల వరకు వెళ్లకుండా లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్‌పై పారాలీగల్ వలంటీర్లు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆమె వెంట జిల్లా న్యాయసేవాధికార సంస్థకార్యదర్శి శ్రీవాణి తదితరులు ఉన్నారు.
రైతు సమస్యలు
పరిష్కరించాలి
హుజూర్‌నగర్: తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వారి సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి పంటకు మద్దతు ధర అందించాలన్నారు. రైతుల రుణమాఫీ, సన్నరకం వడ్లకు బోనస్, రైతు భరోసా పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, నాయకులు యల్లావుల రమేష్, జడ వెంకన్న, జక్కుల రమేష్, సుందరి పద్మ, జక్కుల శ్రీనివాస్, యల్లావుల ఉమ, చెన్నబోయిన సైదులు, చక్రాల స్టాలిన్, యల్లావుల సురేందర్, కుడితొట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు.
వైద్యసేవల్లో
లోపాలు ఉండొద్దు
హుజూర్‌నగర్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పక్కాగా అందించాలని, లోపాలుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోటాచలం హెచ్చరించారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలని చెప్పారు. ఈ సమావేశంలో హుజూర్‌నగర్, కోదాడ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
యాదవులకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలి
సూర్యాపేట టౌన్: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 30 వేల నుంచి 40 వేల ఓట్లు కలిగిన అతిపెద్ద సామాజిక వర్గం యాదవులు అన్నారు. జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌కు ఎమ్మెల్సీ సీటు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తూము వెంకన్న యాదవ్, గొడ్డేటి సైదులు యాదవ్, కోడి లింగయ్య యాదవ్, రమేష్ యాదవ్, కంచుగట్ల జానయ్య, నాగరాజు, భిక్షపతి యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కాసం రాము యాదవ్, మల్లేష్, వెంకటేష్, సైదులు, వేల్పుల లింగయ్య యాదవ్, కంచుగట్ల యాదగిరి యాదవ్, రాజు యాదవ్, కుర్ర సైదులు యాదవ్, నర్సయ్య, రమణ పాల్గొన్నారు.
8న జాతీయ లోక్ అదాలత్
8న జాతీయ లోక్ అదాలత్
Comments
Please login to add a commentAdd a comment