వైభవంగా రథోత్సవం
మేళ్లచెరువు: మేళ్లచెరువు మండలకేంద్రంలోని ఇష్టకామేశ్వరి సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన శుక్రవారం వివిధ రకాల పూలతో అలంకరించిన రథంపై ఉత్సవమూర్తులను వైభవంగా ఊరేగించారు. ముందుగా వేదమూర్తులు గణపతి పూజ, హోమం, రథాంగపూజ, అష్టదిక్పాలకులకు శాంతి నిర్వహించి ఓం నమఃశివాలయ అంటూ భక్తులు స్వామివారిని స్మరిస్తూ మంగళవాయిద్యాలు, నృత్య ప్రదర్శనల నడుమ పురవీధుల్లో రథాన్ని లాగి భక్తిభావం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.భాస్కర్, ఆలయ కార్యనిర్వాహణాధికారి కొండారెడ్డి, రెనివేషన్ కమిటీ చైర్మన్ శాగంరెడ్డి శంభిరెడ్డి, కాకునూరి భాస్కరరెడ్డి, శాగంరెడ్డి గోవిందరెడ్డి, కమిటీ సభ్యులు నర్సింహరావు, శ్రీను, శంభయ్య, గోవిందరెడ్డి, చందర్‌రావు, గణేష్, అర్చకులు రాధాకృష్ణమూర్తిశర్మ, విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment