పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగొద్దు
సూర్యాపేట టౌన్: ఈనెల 5వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలను ఎలాంటి అవకతవకలు, అక్రమాలకు తావు లేకుండా బోర్డు నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ చకిలం హేమచందర్, డీఐఈఓ భానునాయక్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో డీఓలు, సీఎస్‌లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. పేపర్ లీకేజీలు, ప్రశ్న పత్రాలు జారీలో ఎలాంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 12 ప్రభుత్వ, 20 ప్రైవేట్ కళాశాలల్లో సూర్యాపేటలో 13, కోదాడలో 8, హుజూర్‌నగర్‌లో 2, తుంగతుర్తిలో 2, నెమ్మికల్‌లో 1, మఠంపల్లిలో 1, నడిగూడెంలో 2, తిరుమలగిరిలో 2, నేరేడుచర్లలో 1 చొప్పున మొత్తం 32 కేంద్రాల్లో పరీక్షలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిల్లో జనరల్ ఫస్టియర్ 6,688 మంది, జనరల్ సెకండియర్ 6,666 మంది, ఒకేషనల్ ఫస్టియర్ 1,952, ఒకేషనల్ సెకండియర్ 1,642 మందితో కలిపి మొత్తం 16,948 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, 32 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 32 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లతోపాటు 850 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. బోర్డు నిబంధనల మేరకు ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబడదన్నారు. ఈ కార్యక్రమంలో డీఈసీ సభ్యులు జానపాటి కృష్ణయ్య, గుడిపాటి లక్ష్మయ్య, జిల్లా బల్క్ అధికారి విజయనాయక్, ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ
హేమచందర్, డీఐఈఓ భానునాయక్
Comments
Please login to add a commentAdd a comment