ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కేంద్రంలోనూ పరీక్షల నిర్వహణ తీరును చీఫ్ సూపరింటెండెంట్లు నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఏవైనా సమస్యలు, సందేహాలుంటే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఐఈఓను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, అదనపు ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఐఈఓ అశోక్ కుమార్, ఆర్డీఓలు వేణుమాధవ్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్, రమాదేవి, శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రకుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కోటాచలం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment