సాగునీరు అందించాలని నూతనకల్ రైతుల ధర్నా
భానుపురి (సూర్యాపేట): ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ నూతనకల్ మండలానికి చెందిన రైతులు సూర్యాపేట ఇరిగేషన్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని మాయమాటలు చెప్పారని, ప్రస్తుతం పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన రైతులు తీగల మల్లారెడ్డి, పన్నాల మల్లారెడ్డి, జక్కుల మల్లయ్య, అనిల్‌రెడ్డి, మల్లారెడ్డి, మధుసూదన్, రవీందర్‌రెడ్డి, రవి, సురేందర్, ఆకుల సత్తయ్య, ఉపేందర్‌రెడ్డి, బయ్య ముత్యాలి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment