
కూలీలకు పని కల్పించాలి
జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో పనికోరిన కూలీలందరికీ పనిదినాలు కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి ఉపాధిహామీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, నర్సరీలు, తాగునీరు, శ్రీనిధి, బ్యాంక్ లింకేజీ తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, టీఏలు, ఎఫ్‌ఏలతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు విషయాలపై చర్చించారు. అనంతరం సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్‌డీఓ, జెడ్పీ సీఈఓ వీవీ.అప్పారావు, డీపీఓ నారాయణరెడ్డి, డీఎంహెచ్‌ఓ కోటాచలం, డీసీహెచ్‌ఓ వెంకటేశ్వర్లుతో కలిసి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment