
రంజాన్ దీక్షలు ప్రశాంతంగా కొనసాగించాలి
భానుపురి (సూర్యాపేట): పవిత్ర రంజాన్ మాస దీక్షలను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో కొనసాగించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. రంజాన్ మాసం ఏర్పాట్లపై శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అధికారులు, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుల్లో మసీదు, ఈద్గాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ కోటాచలం, ఆర్డీఓలు వేణుమాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, డీఎస్పీ రవి, మున్సిపల్ కమిషనర్లు, ముస్లిం మతపెద్దలు, ఇమామ్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment