
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
హుజూర్‌నగర్: ‘ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగుతాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కేంద్రాలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోం. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి’ అని డీఐఈఓ వడ్త్యా భానునాయక్ సూచించారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
ప్రశ్న : ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు.?
డీఐఈఓ : జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 32 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో ప్రభుత్వ కళాశాలల్లో 12, ప్రైవేట్ కళాశాలల్లో 20 కేంద్రాలు ఏర్పాటు చేశాం.
ప్రశ్న : పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరవుతున్నారు.?
డీఐఈఓ : జిల్లా వ్యాప్తంగా 74 కళాశాలలకు సంబంధించి మొత్తం 16,948 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వారిలో జనరల్ విభాగంలో ఫస్టియర్ 6,677 మంది, సెకండియర్ 6,666 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఒకేషనల్ ఫస్టియర్ 1,952 మంది, సెకండియర్ విద్యార్థులు 1,642 మంది ఉన్నారు.
ప్రశ్న : పర్యవేక్షణకు తీసుకున్న చర్యలు లేమిటీ?
డీఐఈఓ : పరీక్షల పర్యవేక్షణకు మూడు రూట్‌లు ఏర్పాటు చేశాం. ప్రశ్న పత్రాలను పోలీస్ స్టేషన్లలో భద్రపరిచాం. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు టీముల సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశాం.
ప్రశ్న : పరీక్ష కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లేమిటీ?
డీఐఈఓ : ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షనన్ అమలులో ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోనికి అనుమతిస్తాం. పరీక్ష సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న : పరీక్ష కేంద్రాల్లో ఏయే వసతులు కల్పిస్తున్నారు.?
డీఐఈఓ : అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మూత్రశాలలు, తాగునీటి వసతి, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఉండేలా చూస్తున్నాం. అన్ని కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పట్టణాల్లో మున్సిపల్, మండలాల్లో పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చాం. ప్రతి కేంద్రంలో ప్రథమ చికిత్స కేంద్రాలు, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు.
ప్రశ్న : హాల్ టికెట్లు నేరుగా డౌన్‌లోడ్
చేసుకోవచ్చా?
డీఐఈఓ : విద్యార్థులు హాల్‌టికెట్లు ఇంటర్‌నెట్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆవిధంగా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనకు గురి కాకుండా పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.
ఫ ఇంటర్ వార్షిక పరీక్షలకు
అన్ని ఏర్పాట్లు చేశాం
ఫ జిల్లా వ్యాప్తంగా 32 కేంద్రాలు
ఫ ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాల నిఘా
ఫ పరీక్షలు రాయనున్న విద్యార్థులు 16,948 మంది
‘సాక్షి’తో డీఐఈఓ భానునాయక్
ప్రశ్న : మాస్ కాపీయింగ్ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
డీఐఈఓ : ఇంటర్ బోర్డు హైదరాబాద్ నుంచి ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించింది. ఇది విజయవంతం కావడంతో వార్షిక పరీక్షల నిర్వహణకు వాటిని వినియోగించనున్నాం. ప్రతి కేంద్రంలో ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి ఆస్కారం ఉండదు. ప్రశ్నపత్రాలు తెరవడం నుంచి పరీక్ష పూర్తయిన తర్వాత తిరిగి సీల్ వేసే వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతుంది.

నిమిషం ఆలస్యమైనా అనుమతించం
Comments
Please login to add a commentAdd a comment