
క్రీడోత్సవాలను విజయవంతం చేయండి
భానుపురి (సూర్యాపేట): ఈనెల 16 నుంచి 18 వరకు సూర్యాపేట జిల్లా కోదాడలో జరగనున్న రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక ఉత్సవాలబ్రోచర్‌ను మంత్రి తుమ్మల ఖమ్మంలోని తన నివాసంలో ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి శరత్‌బాబు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కళ్యాణం కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి మేదరమెట్ల సుబ్బయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు పాల్గొన్నారు.
సూర్యక్షేత్రంలో
ప్రత్యేక పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారా యణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజ లను వైభవంగా నిర్వహించారు. తెల్ల వారుజామున ఉషాపద్మిని ఛాయసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం ఆదిత్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకుడు జనార్దన్‌స్వామి, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్‌రావు, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, శ్రీరాంపాండే, అంకిత్‌పాండే పాల్గొన్నారు.
వారబందీ.. రైతుల్లో రందీ
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు వారబందీ విధానంలో వదులుతున్న గోదావరి జలాలను ఆదివారం పునరుద్ధరించాల్సి ఉన్నా రాత్రి వరకు విడుదల చేయలేదు. ఇప్పటికే వరిపొలాలు ఎండుతున్నాయని, అధికారులు ప్రకటించిన వారబందీ షెడ్యూల్ ప్రకారం నీటిని ఎందుకు పునరుద్ధరించలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే నీటిని పునరుద్ధరించి పంటలు చేతికొచ్చే వరకు నిరంతరాయంగా అందించాలని కోరుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం నీటిని పునరుద్ధరిస్తే ఈ నెల 9 వరకు జిల్లాకు వదలనున్నారు.
మద్దతు ధరల చట్టం తేవాలి
భానుపురి (సూర్యాపేట): పంటలకు మద్దతు ధర, ఉత్పత్తి ఖర్చుల నియంత్రణకు చట్టం తేవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) జిల్లా కన్వీనర్లు మల్లు నాగార్జున్‌రెడ్డి, మండారి డేవిడ్ కుమార్, వరికుప్పల వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో వారు మాట్లాడారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5న సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్‌లు నల్లెడ మాధవరెడ్డి, మట్టిపల్లి సైదులు, దండ వెంకట్‌రెడ్డి, కె.సైదులు పాల్గొన్నారు.

క్రీడోత్సవాలను విజయవంతం చేయండి

క్రీడోత్సవాలను విజయవంతం చేయండి
Comments
Please login to add a commentAdd a comment