
ఆన్‌లైన్ ఫిర్యాదులకు చాన్స్
తిరుమలగిరి (తుంగతుర్తి): ఇందిరమ్మ ఇళ్ల పథకానికి చేసుకున్న దరఖాస్తులు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు ఎలాంటి ఆటంకాలు ఉన్నా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం తాజాగా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా అవకాశం కల్పించింది. ఇందిరమ్మ పథకానికి లబ్ధిదారులుగా ఎంపికై న వారితోపాటు పథకానికి సంబంధించి ప్రజలు వివిధ ఫిర్యాదులు చేసుకునేందుకు వీలుంది. అయితే పేద, మధ్యతరగతి వర్గాల్లో అర్హులైన కుటుంబాలకు సొంతిల్లు నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రామాల్లో సభలు నిర్వహించి జాబితాలోని అర్హుల పేర్లను సైతం చదివి వినిపించారు. పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం తమ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక చాలామంది గ్రామ పంచాయతీ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల అనుమానాలు నివృత్తి చేసేలా దరఖాస్తుల స్థితిని తెలుసుకునేలా ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ప్రకారం ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసుకోవచ్చు.
ఫిర్యాదులు చేయాల్సింది ఇలా..
ఇందిరమ్మ ఇళ్లు.తెలంగాణ.జీవో.గవ్ట్.ఇన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. దీంతో స్క్రీన్‌పై దరఖాస్తు స్థితి కనిపిస్తుంది. సెల్‌ఫోన్ నంబర్‌ను నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. అనంతరం పేరు, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఫిర్యాదుల కేటగిరీ ఆప్షన్ కనిపిస్తుంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్జీల స్థితి తెలుసుకునేందుకు..
ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించిన
ప్రభుత్వం
ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక
ప్రక్రియ పూర్తి
ఆప్షన్ క్లిక్ చేయగానే..
సర్వేయర్ సందర్శించలేదు. సంతృప్తి చెందలేదు. సర్వే సక్రమంగా జరగలేదు. సర్వే సమయంలో గైర్హాజరయ్యారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేయలేదు. మధ్యవర్తితో సమస్య ఉంది. డబ్బు డిమాండ్ చేస్తున్న సర్వేయర్ అనే ఐచ్చికాలు కనిపిస్తాయి వీటిలో దరఖాస్తుదారులు ఎదుర్కొన్న సమస్యను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత కింద ఉన్న బాక్సులో ఫిర్యాదు వివరాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం స్థలం, ఇతర ధ్రువీకరణ పత్రాలు టు ఎంబీ పరిమాణం వరకు పీడీఎఫ్, బీఎన్‌జీ, జేపీజీ అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఫిర్యాదు నంబర్ వస్తుంది. దానిని జాగ్రత్తగా భద్రపరిస్తే కొద్దిరోజుల తర్వాత ఫిర్యాదు స్థితిని కూడా తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment