
మేళ్లచెరువులో ముగిసిన ఎద్దుల పందేలు
మేళ్లచెరువు:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మేళ్లచెరువు మండలకేంద్రంలో ఐదు రోజు లుగా కొనసాగుతున్న ఎద్దుల పందేలు ఆదివారం రాత్రి ముగిశాయి. సీనియర్స్ విభాగంలో 12 జతలు పాల్గొనగా హుజూర్‌నగర్‌కు చెందిన సుంకి సురేందర్‌రెడ్డి గిత్తలు 25 నిమిషాల వ్యవధిలో 3,046 అడుగుల దూరం బండలాగి మొదటి బహుమతి గెలుపొందాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా యాదిరెడ్డిపల్లెకు చెందిన లక్కిరెడ్డి నిక్షేత్‌రెడ్డి, అకిలేష్‌రెడ్డి గిత్తలు రెండవ బహుమతి సాధించాయి. పల్నాడు జిల్లా ఇనిమెట్లకు చెందిన కటకం వెంకటేశ్వర్లు గిత్తలు మూడవ బహుమతి సాధించాయి. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి చేతులమీదుగా మొదటి బహుమతిగా మహీంద్రా 405 యువో టెక్ ట్రాక్టర్, రెండవ బహుమతిగా రూ.1.50లక్షలు, మూడవ బహుమతిగా రూ.1.10లక్షలను ఎద్దుల పోషకులకు అందిచారు. ఈ కార్యక్రమంలో పోశం నర్సిరెడ్డి, వంగవీటి రామారావు దేవాలయ కమిటీ చైర్మన్ శంభిరెడ్డి, కాకునూరి భాస్కరెడ్డి, లక్ష్మీనారాయనణరెడి, సైదేశ్వరరావు, ముడెం వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బండ లాగుతున్న ఎద్దులు
Comments
Please login to add a commentAdd a comment