
స్వేరో కుటుంబాలకు అండగా ఉంటా
పెన్‌పహాడ్: స్వేరో నెట్‌వర్క్‌లో భాగమైన గురుకుల తల్లిదండ్రుల కుటుంబాలకు అండగా ఉంటానని స్వేరో నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు, సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన గురుకుల తల్లిదండ్రుల కమిటీ రాష్ట్ర నాయకురాలు పల్లెపంగు రాణి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా స్వేరో అనుబంధ సంఘమైన గురుకుల విద్యార్థుల తల్లిదండ్రుల జిల్లా కమిటీ అధ్యక్షుడు బొల్లికొండ వీరస్వామి ఆధ్వర్యంలో ఆదివారం అనంతారం గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ పలకరింపు (కడుపు చల్ల) కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరై రాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో స్వేరో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మామిడాల ప్రవీణ్‌కుమార్, చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య, స్వేరో రాష్ట్ర అధ్యక్షులు వీరన్న, తల్లిదండ్రుల కమిటీ జిల్లా అధ్యక్షుడు మచ్చ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment