భానుపురి (సూర్యాపేట) : ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్‌గా దుద్దిళ్ల శ్రీపాదరావు అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. ఆదివారం సూర్యాపేట కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డీఎం శర్మ, డీపీఓ నారాయణరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస నాయక్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment